ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క ఆవుతో పదెకరాల్లో సేంద్రీయ సాగు

ABN, First Publish Date - 2022-08-04T06:06:54+05:30

ఒక్క ఒంగోలు ఆవుతో సుమారు 10 ఎకరాల్లో ఆర్గానిక్‌ వ్యవసాయం చేయవచ్చని, దీని వల్ల భవిష్యత్‌ తరాలకు కలుషితం లేని భూమి, గాలి, నీటిని అందించవచ్చని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌టీవీ సత్యగోవిందు అన్నారు.

ఆవుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డాక్టర్‌ సత్యగోవిందు

కొవ్వూరు, ఆగస్టు 3: ఒక్క ఒంగోలు ఆవుతో సుమారు 10 ఎకరాల్లో ఆర్గానిక్‌ వ్యవసాయం చేయవచ్చని, దీని వల్ల భవిష్యత్‌ తరాలకు కలుషితం లేని భూమి, గాలి, నీటిని అందించవచ్చని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌టీవీ సత్యగోవిందు అన్నారు. పశు సంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కొవ్వూరు పశువుల ఆసుపత్రిలో ఒంగోలు జాతి పశువుల ఆరోగ్య, గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించారు. పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్‌ పాకలపాటి గాంధీ ఆధ్వర్యంలో పశుపోషణ, పునరుత్పత్తిపై అవగాహన కల్పించారు. డాక్టర్‌ సత్యగోవిందు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందన్నారు. సేం ద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని, గో సంరక్షణ ద్వారా భావితరాలకు కలుషితం లేని వాతావరణాన్ని అందించవచ్చునని అన్నారు. ఔషధ విలువలు కలిగిన పాలతో అనేక రుగ్మతలు దూరమవుతాయన్నారు. పాడిరైతుల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వాలు అమూల్‌ సంస్థతో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాయన్నారు. ఇప్పటికే నల్లజర్ల, దేవరపల్లిలో ప్రారంభమయ్యాయని, త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రారంభిస్తామన్నారు. అనంతరం పాడి పశువులకు పరీక్షలు నిర్వహించి, సుమారు రూ.25వేలు విలువైన మినరల్‌ మిక్చర్‌, మినరల్‌ టాబ్లెట్స్‌, కాల్షియం సప్లిమెంట్స్‌, పశువులు ఎదకు రావడానికి అవసరమైన మందులు, గర్భకోశ వ్యాధుల నివారణ మందులను పాడిరైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా ఈవో డాక్టర్‌ జి.జేసురత్నం,  పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్‌ ఎ.వెంకటరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T06:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising