ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలి..

ABN, First Publish Date - 2022-01-26T05:36:48+05:30

జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు డివిజన్‌, మండల స్థాయి అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆదేశించారు.

సమావేశంలో కలెక్టర్‌, జేసీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ హరికిరణ్‌
కాకినాడ సిటీ, జనవరి 25: జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు డివిజన్‌, మండల స్థాయి అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ కోర్టు హాల్‌ నుంచి కలెక్టర్‌ హరికిరణ్‌ మంగళవారం జాయింట్‌ కలెక్టర్లు సుమిత్‌ కుమార్‌, కీర్తి చేకూరి, ఎ.భార్గవ్‌తేజ, ఉభయ గోదావరి జిల్లాల సాగునీరు సరఫరా పర్యవేక్షణ ప్రత్యేకాధికారి ఎన్‌.కృష్ణారావుతో కలిసి వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీటిని సరఫరా చేశామన్నారు. సాగు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వారబందీ విధానం అమలు చేసి ఆయుకట్టు రైతులకు సాగనీటిని అందించే ప్రక్రియను అధికారులు చేపట్టాలన్నారు. జిల్లాలో రబీ సాగుకు సంబంధించి దాదాపు నాట్లు ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. జిల్లాలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు అధికారులు, బ్యాంకర్ల సమన్వయంతో రుణ సహాయం అందించే విఽధంగా చర్యలు చేపట్టాలన్నారు.  గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, ట్రైనీ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, హౌసింగ్‌ పీడీ బి.సుధాకర్‌ పట్నాయక్‌, పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఎం.శ్రీనివాసు, డిప్యూటీ డీఎంహెచ్‌వో మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising