ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలం తనఖా పెట్టి కార్మికులకు జీతాలు

ABN, First Publish Date - 2022-01-21T05:16:27+05:30

పొలం తనఖా పెట్టి పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు జీతాలిచ్చాడు ఓ కాంట్రాక్టర్‌.. ప్రభుత్వం నుంచి బిల్లు మంజూరు కాకపోవడంతో మూడు నెలల నుంచి కాకినాడ జీజీహెచ్‌లో పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు జీతాలు అందడం లేదు.

కాంట్రాక్టర్‌కు సత్కారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాంట్రాక్టర్‌కు సత్కారం
జీజీహెచ్‌(కాకినాడ), జనవరి 20: పొలం తనఖా పెట్టి పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు జీతాలిచ్చాడు ఓ కాంట్రాక్టర్‌.. ప్రభుత్వం నుంచి బిల్లు మంజూరు కాకపోవడంతో మూడు నెలల నుంచి కాకినాడ జీజీహెచ్‌లో పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు జీతాలు అందడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ లోపు పండుగ వచ్చేసింది. తన దగ్గర పనిచేస్తున్న కార్మికులు పండుగ పూట డబ్బులు లేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కాంట్రాక్టర్‌ గోకేడ రాంబాబు, జీతాలిచ్చేందుకు ముందుకు వచ్చాడు. తన పొలాన్ని తాకట్టు పెట్టి సుమారు రూ.2 కోట్లు సమకూర్చి 240 మంది పారిశుధ్య కార్మికులు, 183 మంది సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలల జీతాలు ఇచ్చేశాడు. దీంతో కార్మికుల ఆనందానికి అవధుల్లేవు. కృతజ్ఞతగా కార్మికులు, సెక్యూరిటీ గార్డులు కలిసి గురువారం కాంట్రాక్టర్‌ గోకేడ రాంబాబు, రూపలతాదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు విజయకుమార్‌, రాయుడు రమేష్‌, వాసు, శేషు, బాబ్జి, లోకేష్‌, మోహన్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-21T05:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising