ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టు పోస్టుల భర్తీలో అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-09-10T07:00:16+05:30

కాంట్రాక్టు పోస్టుల భర్తీకి సంబం ధించి విద్యార్హత ధ్రువపత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె. నివాస్‌లు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర వీడియో కాన్ఫరెన్సు

అమలాపురం, సెప్టెంబరు9 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు పోస్టుల భర్తీకి సంబం ధించి విద్యార్హత ధ్రువపత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె. నివాస్‌లు సూచించారు. నకిలీ సర్టిఫికెట్లతో కొందరు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఘటనలు ఇటీవలకాలంలో జరిగినందున అటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులకు అన్నిరకాల వసతులు కల్పించాలని ఆదేశించారు. వెలగ పూడి నుంచి ఉన్నతాధికారి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు స్థానిక కలెక్టరేట్‌ నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజారోగ్య పరి రక్షణలో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలని ఆదేశించారు. ఆసు పత్రి ప్రసవాలు, వ్యాధుల నియంత్రణ, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, బయోమెట్రిక్‌ హాజరు, ఫీవర్‌ సర్వే, కుటుంబ నియంత్రణ, జననీ శిశుసంరక్షా యోజన తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన జరుగు తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తూ నిరుపేదలకు అండగా నిలవాలని సూచించారు. హైరిస్క్‌ గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మాతా శిశు మరణాల రేట్లను తగ్గించాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సత్యనారాయణ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ సీహెచ్‌ భరతలక్ష్మి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకరరావు, అన్ని విభాగాల వైద్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-10T07:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising