ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు

ABN, First Publish Date - 2022-08-19T06:20:24+05:30

వేమగిరి-బుర్రిలంక ఇసుకర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా మైన్స్‌ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఉత్తమ పురస్కారాలు అందుకున్న అధికారులను సత్కరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
  • మైన్స్‌, విద్యుత్‌శాఖలపై సభ్యుల ఆగ్రహం 
  • కడియం మండల పరిషత్‌ సమావేశం

కడియం, ఆగస్టు 18: వేమగిరి-బుర్రిలంక ఇసుకర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా మైన్స్‌ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం స్థానిక మం డల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ప్రసాద్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. వేమగిరి-బుర్రిలంక ఇసుకర్యాంపు తవ్వకాలపై వివరణ ఇవ్వ డానికి అధికారులు రాకపోవడం దారుణమన్నారు. మండలంలో విద్యుత్‌ సరఫరా అధ్వానంగా తయారైందని, చిన్నపాటి గాలి వేసినా, వర్షం వచ్చినా సరఫ రాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు, ఉద్యోగులు పట్టించుకోవడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ప్ర మాదముందని కార్యదర్శులు పారిశుధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలని ఎంపీడీవో కె.రత్నకుమారి చెప్పారు. సమావేశంలో తహశీల్దారు ఎం.సుజాత, గృహనిర్మాణశాఖ ఏఈ సత్యనారాయణమూర్తి, వైస్‌ ఎంపీపీలు పంతం గణపతి, కలిదిండి విశాలాక్షి, మండల ప్రతిపక్షనేత గిరజాల బాబు, శాప్‌ డైరెక్టర్‌ బీమిరెడ్డి నాగేంద్ర, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 

సేవా పురస్కారాలు అందుకున్న అధికారులకు సత్కారం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఉత్తమ సేవా అవార్డులు అందుకున్న అధికారులకు సత్కారం జరిగింది. మండలం నుంచి ఎంపీడీవో కె.రత్నకుమారి, ఏవో కె.చంద్రరావు, వైద్యాధికారి డాక్టర్‌ మహీంద్ర, ఎస్‌ఐ ఎస్‌కే అమీనాబేగం, ఆర్‌ఐ సోనీ, వెటర్నరీ అధికారి కె.సతీష్‌కుమార్‌, ఉద్యానశాఖ అధికారి డి.సుధీర్‌కుమార్‌, ఎఫ్‌డీవో జి.గోపాలరావు, ఉపాధి హామీ పథకం టీఏ డీఎన్‌  మూర్తి, వ్యవసాయశాఖ విప్తరణాధికారి ఎం.నాగేశ్వరరావు ఉత్తమ అవార్డులు అం దుకున్నారు. వారిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు.

Updated Date - 2022-08-19T06:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising