ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల పట్ల వివక్షత చూపొద్దు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-06-28T06:32:49+05:30

పిల్లల పట్ల ఆడ,మగ అన్న వివక్షత చూప కుండా ఇద్దరినీ సమానంగా పెంచి చదివించాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధ వీలత తల్లిదండ్రులకు సూచించారు.

పాతతుంగపాడులో అమ్మఒడి నమూనా చెక్‌ అందజేస్తున్న కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాతతుంగపాడులో జిల్లాస్థాయి అమ్మఒడి పథకం ప్రారంభం


దివాన్‌చెరువు, జూన్‌ 27 : పిల్లల పట్ల ఆడ,మగ అన్న వివక్షత చూప కుండా ఇద్దరినీ సమానంగా పెంచి చదివించాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధ వీలత తల్లిదండ్రులకు సూచించారు.పాతతుంగపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన జగనన్న మూడో విడత అమ్మఒడి పథకం జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. భావితరాలకు మనం ఇచ్చే ఆస్తి విద్యేనని చెప్పారు. జిల్లాలో 1.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పఽథకం కింద రూ.243 కోట్ల జమ చేయడం జరిగిందన్నారు. అలాగే పాఠశాలలో నాడు నేడు పనులు సక్రమంగా జరగకపోయినా, మరుగుదొడ్లు నిర్వహణ సక్రమంగా లేకపోయినా ఉపాధ్యాయులను అడగాలన్నారు. పాఠశాల నిర్వహణ విషయమై ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు, పిల్లలకు   ఉందన్నారు.ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలోని రాజానగరం, పుణ్యక్షేత్రం, సీతానగరం మండలం వెదుళ్లపల్లి, కోరుకొండ మం డలం గాడాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి నూతనంగా జూనియర్‌ కళా శాలలు ప్రారంభించనున్నామని చెప్పారు. పాత తుంగపాడులో  మరో జూని యర్‌ కళాశాల మంజూరు చేయాలని  కలెక్టర్‌ను కోరారు. ఎంపీ  మార్గాని భరత్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తు న్నారని చెప్పారు.అనంతరం జిల్లాలోని పేరెంట్స్‌ కమిటీకి జగనన్న అమ్మఒడి నమూనా చెక్కును అందజేశారు.కార్యక్రమంలో డీఈవో ఎస్‌.అబ్రహం, ఆర్డీవో ఎ.చైత్రవర్షిణి, సర్పంచ్‌ ఎరుబండి రాంబాబు, ఎంపీపీ మండారపు సీతారత్నం వీర్రాజు, రుడా చైర్‌పర్సన్‌ షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-28T06:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising