ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించను

ABN, First Publish Date - 2022-05-28T06:38:05+05:30

లక్ష్యసాధనలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత హెచ్చరించారు.

కలెక్టర్‌ మాధవీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు కలెక్టర్‌ మాధవీలత హెచ్చరిక


రాజమహేంద్రవరం, మే 27(ఆంధ్రజ్యోతి): లక్ష్యసాధనలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత హెచ్చరించారు. కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నుం చి శుక్రవారం పాఠశాలలో నాడు-నేడు,హౌసింగ్‌,  సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్‌ భవనాల పురోగతిపై సంబంధిత అధికారులకు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో ఇంకా గ్రౌండ్‌ కాకుండా ఉన్న భవనాలను వెంటనే గ్రౌండింగ్‌ చేయాలని, నాడు-నేడుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి  చేయాలన్నారు. జిల్లాలో 15 సచివాలయాలు, 52 ఆర్‌బీకేలు, 91 వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌ సెంటర్ల భవనాలు ప్రారంభించాల్సి ఉందన్నారు. సంబంఽధిత అధికారులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఏ ఒక్క అధికారి అలసత్వం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండలాల ఇంజనీరింగ్‌ అధికార్లతో సమీక్షిస్తూ ప్రభుత్వ భవన నిర్మాణాలపురోగతిలో నిర్ధేశించిన లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. నాడు నేడు, జగనన్న కాలనీలకు అవసరమైన సిమెంట్‌ స్టీల్‌ అందుబాటులో ఉన్నాయని, వర్షాకాలంలో ఇబ్బందిలేకుండా  మెటీరియల్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్‌ అధికారి బి.తారాచంద్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.స్వర్ణలత, డీఈవో ఎస్‌.అబ్రహం,డీఏవో ఎస్‌.మాధవరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T06:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising