ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

ABN, First Publish Date - 2022-05-17T07:01:00+05:30

రాజమహేంద్రవరం, మే 16 (ఆంధ్రజ్యోతి) : జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలి.. దీనికోసం శాఖల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం హౌసింగ్‌, సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ నిర్మాణం పురోగతిపై అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపా

సమీక్ష చేస్తున్న జిల్లా కలెక్టర్‌ మాధవీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత 

రాజమహేంద్రవరం, మే 16 (ఆంధ్రజ్యోతి) : జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలి.. దీనికోసం శాఖల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం హౌసింగ్‌, సచివాలయాలు,  ఆర్బీకే, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ నిర్మాణం పురోగతిపై అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో గ్రౌండింగ్‌, ఆర్సీ, స్లాబ్‌ లెవల్‌ వంటి పనులలో పురోగతిని వారంవారం చూపించాలన్నారు. కాలనీల్లో రహదారులు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యా లు త్వరగా కల్పించాలని ఆదేశించారు. ఇసుక, సిమెంట్‌, ఐర న్‌ నిల్వలు ఉన్నాయని, ఇంటి నిర్మాణం కోసం ఇంకా ముం దుకు రాని లబ్ధిదారులు కట్టుకునేవిధంగా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జేసీ సీహెచ్‌ శ్రీధర్‌, ఆర్డీవో ఏ.చైత్రవర్షిణి, హౌసింగ్‌ పీడీ టి.తారాచంద్‌, ఇతర అధికారులు సోములు, పరశురాం పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T07:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising