ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌.. చిక్కింది!

ABN, First Publish Date - 2022-11-12T01:34:59+05:30

చికెన్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి, గత ఐదు నెలల నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే కార్తీక మాసం కావడంతో మాంసం ప్రియులు తినకపోడంతో మరింత తగ్గుతూ వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కిలో రూ.200.. స్కిన్‌లెస్‌ కిలో రూ.220..కార్తీక మాసం ప్రభావం

తుని, నవంబరు 11: చికెన్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి, గత ఐదు నెలల నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే కార్తీక మాసం కావడంతో మాంసం ప్రియులు తినకపోడంతో మరింత తగ్గుతూ వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో రోజువారీ వ్యాపారాలతో పోలిస్తే అమ్మకాలు భారీగా తగ్గాయంటున్నారు. ప్రస్తుతం 25శాతం మేర మాత్రమే వ్యాపారం జరుగుతోంది. గడిచిన వేసవిలో చాలా మంది రైతులు, కంపెనీలు సైతం బ్రాయిలర్‌ కోడి పిల్లలను ఎక్కువ స్థాయిలో పెంచారు. అలాగే పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో ఉత్పత్తి భారీగా పెరగడంతో బ్రాయిలర్‌ కోళ్ల దిగుమతి పెరిగింది. ఈ క్రమంలో కార్తీకమాసం కారణంగా అమ్మకాలు పడిపోవడంతో మాంసం ధరలు చాలావరకూ తగ్గిపోయా యి. ప్రస్తుత మార్కెట్‌లో కిలో చికెన్‌ (బ్రాయిలర్‌) రూ.200, స్కిన్‌లెస్‌ రూ.220, ఉంది. బొంతకోడి రూ. 180 - 240 పలుకుతోంది. గతంలో రూ.260 నుంచి 280 వరకూ చికెన్‌ ధర పలికింది. ధర తగ్గినప్పటికీ కార్తీకమాసం పూజల వల్ల అమ్మకాలు లేకపోవడంతో దుకాణాలు వెలవెలబోతున్నాయి.

Updated Date - 2022-11-12T01:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising