ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్పొస్తే ఒట్టు

ABN, First Publish Date - 2022-08-04T06:54:35+05:30

నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరంలో ప్రభుత్వాసుపత్రి, సబ్‌ డివిజనల్‌ కార్యాలయాలు, సర్కిల్‌ కార్యాలయం, ఇంజనీరింగ్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు వున్నాయి.

బస్టాండు లోపల కూడా పెరిగిన చెత్త మొక్కలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా ఏళ్లుగా బస్సులు రాని ముమ్మిడివరం బస్టాండు

వినియోగానికి నోచుకోకుండానే నిరుపయోగం

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన వైనం

నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరంలో నిర్మించిన బస్టాండు లోపలకి బస్సులు రావు. 26 సంవత్సరాలుగా ఇది నిరుపయోగంగానే వుంది. ప్రయాణికులకు సేవలు అందించకుండానే శిథిలావస్థకు చేరుకుంది. బస్సుల కోసం రోడ్డు పక్కనే నిరీక్షించాల్సిన పరిస్థితి. దీంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బస్టాండు లోపలకు, వెలుపలకు వెళ్లే రోడ్లు ఇరుకుగా ఉండడం, రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు రోడ్డును ఆక్రమించడంతో  బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. 

ముమ్మిడివరం, ఆగస్టు 3: నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరంలో ప్రభుత్వాసుపత్రి, సబ్‌ డివిజనల్‌ కార్యాలయాలు, సర్కిల్‌ కార్యాలయం, ఇంజనీరింగ్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు వున్నాయి. కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత ఇక్కడి ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 37 జిల్లా కేంద్ర కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో అనేక మంది ప్రజలు ముమ్మిడివరానికి రాకపోకలు సాగిస్తున్నారు. 1992 సంవత్సరంలో కేశవస్వామి దేవస్థానానికి చెందిన 1.68 ఎకరాల భూమిలో బస్టాండు నిర్మాణానికి అప్పటి రవాణా శాఖ మంత్రి పెన్మెత్స సాంబశివరాజు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రూ.10లక్షలతో బస్టాండు నిర్మాణం జరిగింది. 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. కొంతకాలం బస్టాండులోకి బస్సులు రాకపోకలు సాగించినా ఆ తర్వాత బస్టాండు లోపలకు, బయటికి వెళ్లే రోడ్లు ధ్వంసం కావడం, ఇరుకుగా ఉండడంతో బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఈ రోడ్లను ఆధునికీకరించినా రాకపోకలు మాత్రం పునరుద్ధరించలేదు. బస్టాండు ఆవరణలోనే పెరిగిన తుప్పలను కూడా పలుసార్లు తొలగింప జేశారు. బస్టాండులో మరుగుదొడ్లు, మంచినీటి కుళాయిలు, కూర్చునే బల్లలు, వైరింగ్‌, బస్సులు వెళ్లే ప్రదేశాలను తెలిపే నేమ్‌ బోర్డులు ధ్వంసమయ్యాయి. బస్సులు మెయిన్‌రోడ్డు నుంచే వెళ్లిపోతున్నాయి. పాఠశాలలు ప్రారంభం, వదిలే సమయాల్లో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంటుంది. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అయినవిల్లి, ఉప్పలగుప్తం మండలాలకు చెందిన సుమారు 25వేల మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. కాకినాడ, అమలాపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్‌, నాన్‌స్టాప్‌, పాసింజర్‌ సర్వీసులు నడుస్తున్నాయి. బస్టాండు ఆవరణలో పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. విషసర్పాలు కూడా సంచరిస్తుండడంతో  ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. 



Updated Date - 2022-08-04T06:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising