ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయో డీజిల్‌

ABN, First Publish Date - 2022-10-28T02:07:25+05:30

జిల్లాలో బయో డీజిల్‌ పేరుతో లూబ్రికెంట్‌ కల్తీ ఆయిల్‌ను విక్రయిస్తూ కొందరు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడు తున్నారు. ఇదంతా యథేచ్ఛగా జరిగిపోతున్నా అధికారులెవరూ స్పందించరు. ఎందుకంటే పోలీసు, వాణి జ్య పన్నులు, పౌర సరఫరాల శాఖల్లోని కొందరు అధి కారులకు, సిబ్బందికి ఇదొక ఆదాయ వనరుగా మార డమే కారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సమిశ్రగూడెంలో బయోడీజిల్‌ పేరుతో నిర్వహిస్తున్న బంకు

  • జిల్లాలో యథేచ్ఛగా బయో డీజిల్‌ విక్రయాలు

  • లూబ్రికెంట్‌ ఆయిల్‌తో కలిపి కల్తీ చేస్తున్న వైనం

  • బంకులకు అనుమతే లేదంటున్న అధికారులు

  • కొరవడిన నిఘాతో చెలరేగుతున్న మాఫియా

నిడదవోలు, అక్టోబరు 27 : జిల్లాలో బయో డీజిల్‌ పేరుతో లూబ్రికెంట్‌ కల్తీ ఆయిల్‌ను విక్రయిస్తూ కొందరు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడు తున్నారు. ఇదంతా యథేచ్ఛగా జరిగిపోతున్నా అధికారులెవరూ స్పందించరు. ఎందుకంటే పోలీసు, వాణి జ్య పన్నులు, పౌర సరఫరాల శాఖల్లోని కొందరు అధి కారులకు, సిబ్బందికి ఇదొక ఆదాయ వనరుగా మార డమే కారణం. జిల్లావ్యాప్తంగా బయోడీజిల్‌ పేరుతో ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్‌లు చెల్లించకుండా దొడ్డిదారిన లూబ్రికెంట్‌ ఆయిల్‌ను భారీఎత్తున దిగు మతి చేసుకుని, దాన్ని కల్తీ చేసి లారీలకు బయో డీజిల్‌ పేరుతో విక్రయిస్తున్నారు. వస్తు రవాణా జర గాలంటే లారీలదే ప్రధానపాత్ర. ఇటువంటి లారీలకు డీజిలే ఇంధనం. అయితే కొందరు డ్రైవర్లు డీజిల్‌కు బదులుగా బయో డీజిల్‌ను కొట్టిస్తున్నారు. డీజిల్‌ సుమారుగా లీటరుకు రూ.99 ఉండగా బయోడీజిల్‌ పేరుతో విక్రయించే ఆయిల్‌ లీటరు రూ.70కే అందు బాటులో ఉండడంతో కొందరు లారీ డ్రైవర్లు దీనిపైనే మొగ్గుచూపుతున్నారు. నిజానికి బయోడీజిల్‌ వినియోగం కూడా ఈమధ్య బాగానే పెరిగింది. ఇంధన వ్యయం కొంతవరకు తగ్గడం వీరికి ఊరటనిస్తోంది. కానీ బయోడీజిల్‌ పేరుతో ఒక మాఫియా తయారై కల్తీ చేయడం ద్వారా సొమ్ము చేసుకుంటోంది. దీనివల్ల వాహనాదారులు మోసపోవడంతోపాటు వారి వాహనాలకు ఎనలేని నష్టం జరుగుతుంది. ఇవేమీ తెలియని వారంతా బయోడీజిల్‌ను వాడేస్తున్నారు. ఒక ట్యాంకర్‌లో 1200 లీటర్లు బయోడీజిల్‌ పేరుతో ఉన్న ఆయిల్‌ విక్రయిస్తే సుమారుగా లీటరుకు రూ. 29 చొప్పున ట్యాంకర్‌కు సుమారు రూ.35,000 మిగు లుతుంది. అయితే ఈ మాఫియా బయోడీజిల్‌లో రెండో రకం లూబ్రికెంట్‌ ఆయిల్‌ను కల్తీచేసి విక్రయి స్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. దీనివల్ల మాఫియాకు మరింత ఎక్కువ మిగిలిపోతోంది. ఈ లూబ్రికెంట్‌ ఆయిల్‌ కూడా ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్‌లు చెల్లించకుండానే దిగుమతి చేసుకుని దీన్ని కల్తీ చేసి బయోడీజిల్‌ పేరుతో బహిరంగంగానే విక్ర యించేస్తున్నారు. విజ్జేశ్వరం రోడ్డులోని సమిశ్రగూ డెంలో ఒక వ్యక్తి అనుమతులు లేకుండానే బయో డీజిల్‌ బంక్‌ పేరుతో యఽథేచ్ఛగా విక్రయాలు సాగి స్తున్నట్టు సమాచారం. మరొక వ్యక్తి సమిశ్రగూడెం గ్రామంలోనే నర్సాపురం రోడ్డులో చీకటి పడితే చాలు తెల్లవారేవరకు బయోడీజిల్‌ పేరుతో విక్రయాలు సాగి స్తున్నాడు. ఒక్క నిడదవోలు పట్టణం, మండలం పరిధి లోనే సుమారు 350 లారీలు బయట ప్రాంతాలకు వస్తూ రవాణా చేస్తుంటాయి. వీటికితోడు తణుకు, తాడేపల్లి గూడెం, కొవ్వూరు, యర్నగూడెం, సీతంపేటతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రాంతాల నుంచి సైతం లారీలు ఈ బయోడీజిల్‌ పేరుతో విక్రయించే బంక్‌లకు క్యూ కడుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో బయో డీజిల్‌ బంక్‌ ఏర్పాటుకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసిన వారు ఎవరూ లేరని అధికారులు చెబుతున్నారు. బహిరంగంగా ఇలా జరుగుతున్నా సంబంధిత అధికారు లు చడీచప్పుడు కాకుండా ఉండడంపై పలువురు అను మానం వ్యక్తంచేస్తున్నారు. ఇలా విక్రయాలు సాగించే వారిలో గతంలో ప్రభుత్వ కిరోసిన్‌ను దారి మళ్లించి దొడ్డిదారిన విక్రయిస్తూ అధికారులకు అడ్డంగా దొరికిన వ్యక్తి ఒకరైతే, గతంలో బయోడీజిల్‌ పేరుతో విక్రయాలు సాగిస్తుండగా ఫిర్యాదు అందడంతో విజిలెన్స్‌ ఎస్పీ పట్టు కుని కేసు నమోదు చేయబడిన వ్యక్తి మరొకరు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు బయో డీజిల్‌ మాఫియాపై ఇప్ప టికైనా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

ఒక్క బంకుకూ అనుమతి లేదు..

ప్రసాద్‌, డిస్ట్రిక్ట్‌ సప్లయ్‌ ఆఫీసర్‌ (డీఎస్‌వో)

జిల్లాలో బయోడీజిల్‌ బంక్‌లు ఏర్పాటుకు బంక్‌లో బయో డీజిల్‌ నిల్వ చేసుకునేందుకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. కానీ కొందరు అనుమతి లేకుండానే విక్రయాలు సాగిస్తుండడంతో గత ఏడాది జిల్లావ్యాప్తంగా బయోడీజిల్‌ బంక్‌లు అన్నింటినీ మూ యించివేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో బయో డీజిల్‌ బంక్‌లకు ఎక్కడా అనుమతి లేదు. ఇంతవరకు దరఖాస్తు చేసుకున్నవారు కూడా లేరు. లూబ్రికెంట్‌ ఆయిల్‌ విక్రయించుకునేందుకు కూడా లైసెన్స్‌ ఉంది. దానికీ లైసెన్స్‌ అవసరం. అనధికారికంగా బయోడీజిల్‌ బంక్‌ నడిపినా, లూబ్రికెంట్‌ ఆయిల్‌ విక్రయించినా మా దృష్టికి తీసుకువస్తే తక్షణం చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-10-28T02:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising