ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ అదుపుతప్పి.. ప్రేమ జంటకు ప్రమాదం

ABN, First Publish Date - 2022-07-23T06:46:09+05:30

పిఠాపురం బైపాస్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం పెళ్లి చేసుకునేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • యువకుడు మృతి.. యువతికి గాయాలు
  • అన్నవరంలో పెళ్లి చేసుకునేందుకు వెళుతుండగా దుర్ఘటన
  • యువకుడి మృతిపై తల్లి అనుమానాలు

పిఠాపురం, జూలై 22: పిఠాపురం బైపాస్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం పెళ్లి చేసుకునేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాకినాడ నగరంలోని జగన్నాథపురం ప్రాంతానికి చెందిన పాలెపు గణేష్‌ (21) డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. గణేష్‌ కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నాడు. వీరు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ నుంచి మోటార్‌ సైకిల్‌పై అన్నవరంలో పెళ్లిచేసుకునేందుకు బయలుదేరారు. పిఠాపు రం బైపాస్‌రోడ్డులోకి వచ్చేసరికి రాపర్తి జంక్షన్‌ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరూ తుప్పల్లో పడిపోయారు. వీరు వేసిన కేకలకు ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు గుర్తించి హైవే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రగాయా లైన గణేష్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. యువతిని తొలుత పిఠాపురం, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. గణేష్‌ మృతదేహానికి పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో శవపంచనామా నిర్వహించారు. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని భావించి వీరు అన్నవరంలో వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. కాగా తన కుమారుడు గణేష్‌ మృతి పై అతని తల్లి లక్ష్మీ పలు అనుమానాలు వ్యక్తంచేసింది. తన కుమారుడిని ఎవరో చంపేశారని, దానిని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె పోలీసులను కోరింది. పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, పట్టణ ఎస్‌ఐ శంకరరావులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2022-07-23T06:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising