ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెల్లం ఎగుమతులు తగ్గుముఖం

ABN, First Publish Date - 2022-05-16T06:04:35+05:30

ఏలేశ్వరం, మే 15: ఏలేశ్వరం మండలం యర్రవరం బెల్లం మార్కెట్టు జిల్లాలో కీలకమైనది. అనకాపల్లి తర్వాత ఇక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు బెల్లం ఎగుమతులు అధికంగా జరుగుతుంటాయి. అయితే ఇటీవల అధికారులు బెల్లం విక్రయాలపై విధించిన ఆంక్షలు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పది కిలోల పైబడి బెల్లం అమ్మితే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు పెట్టడంతో చెరకు పం ట సాగు,బెల్లం తయా

ఏలేశ్వరం: యర్రవరం మార్కెట్‌లో బెల్లాన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారుల ఆంక్షలతో యర్రవరం 

బెల్లం మార్కెట్‌లో తగ్గిన ఎగుమతులు

నిబంధనలు సడలించాలంటూ                   

రైతులు, వ్యాపారుల ఆందోళన

ఏలేశ్వరం, మే 15: ఏలేశ్వరం మండలం యర్రవరం బెల్లం మార్కెట్టు జిల్లాలో కీలకమైనది. అనకాపల్లి తర్వాత ఇక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు బెల్లం ఎగుమతులు అధికంగా జరుగుతుంటాయి. అయితే ఇటీవల అధికారులు బెల్లం విక్రయాలపై విధించిన ఆంక్షలు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పది కిలోల పైబడి బెల్లం అమ్మితే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు పెట్టడంతో చెరకు పం ట సాగు,బెల్లం తయారీ రైతులు, వ్యాపారులు తాము నష్టపోయే ప్రమాదం ఉందంటూ ఆందోళనకు దిగడంతో మార్కెట్‌లో ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలోని ఏలేశ్వరం, జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పిఠాపురం తదితర మెట్ట ప్రాంత మండలాల్లో వరి పంట తర్వాత చెరకు సాగునే అధికంగా చేపడుతున్నారు. ఒక్క ఏలేశ్వరం మండలంలోనే 4700 ఎకరాల్లో పండిస్తున్నారు. యర్రవరం కేంద్రం గా బెల్లం మార్కెట్‌ను ఏర్పాటు చేయడంతో రైతులు పండించిన చెరకు నుంచి తీసిన రసంతో గానుగల ద్వారా బెల్లాన్ని తయారుచేస్తున్నారు. సుమారు 30 గ్రామాల నుంచి రైతులు, వ్యాపారులు యర్రవరం మార్కెట్‌కు తమ బెల్లం ఉత్పత్తులను తీసుకువచ్చి అమ్ముకుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మార్కెట్‌లో కొందరు వ్యాపారులు నల్లబెల్లాన్ని సారా తయారీదారులకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల ఆధారంగా అధికారులు షాపులపై దాడులు చేస్తున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు బెల్లం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని తయారీ రైతులు, వ్యాపారులు ఆందోళనల బాట పట్టడం వివాదాలకు దారి తీస్తోంది. దీంతో జిల్లా అడ్మిన్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌, పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సీఐ కిషోర్‌బాబు, ఎస్‌ఈబీ ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ మార్కెట్‌లో వ్యాపారులకు నిబంధనలపై అవగాహన కల్పిం చి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేపట్టారు. హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల వద్ద రిజిస్టర్‌ ఏర్పాటు చేయాలని, 10కిలోల దాటి బెల్లాన్ని విక్రయిస్తే కొనుగోలుదారు చిరునామా, ఫోన్‌నంబర్‌ తీసుకోవాలని, సారా, మద్యం తయారీకు బెల్లాన్ని విక్రయిస్తేచట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. ఈ నిబంధనల వల్ల మార్కెట్‌కు వ్యాపారులు, రైతులు రావడం మానేస్తున్నారని, బెల్లం ఎగుమతు లు తగ్గి తాము నష్టపోయే పరిస్థితులు కలిగించవద్ద ని పలువురు అధికారులకు విన్నవించుకుంటున్నారు. 


Updated Date - 2022-05-16T06:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising