బలిమెల జలాశయం నుంచి నీటి వాడకంపై సమీక్ష
ABN, First Publish Date - 2022-12-15T00:22:24+05:30
ఆంధ్రా- ఒడిశా ఉమ్మడి రాష్ట్రాల నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి నిర్వహణపై బుధవారం రెండు రాష్ట్రాల అధికారులు సమీక్ష నిర్వహించారు.
మోతుగూడెం, డిసెంబరు 14: ఆంధ్రా- ఒడిశా ఉమ్మడి రాష్ట్రాల నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి నిర్వహణపై బుధవారం రెండు రాష్ట్రాల అధికారులు సమీక్ష నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం ఏపీ జెన్కో అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది. అధికారులు బలిమెల జలాశయంలో నీటి నిల్వల లెక్కలు తేల్చారు. ఒడిసా వాటా 50.7 టీఎంసీలు, ఆంధ్రా వాటా 49.3 టీఎంసీలుగా నిర్ధారించారు. ఇప్పటి వరకు ఒడిసా అదనంగా 8.5 టీఎంసీలు నీరు వాడుకున్నట్లు నిర్ధారించారు. డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టా ప్రాంతాలకు జనవరిలో నీరు విడుదల చేయాల్సి ఉండడంతో డిమాండ్‌కు అనుగుణంగా ప్రస్తుతం బలిమెల జలాశయం నుంచి ఏపీ జెన్కో వాటాగా రెండు వేలా క్యూసెక్కులు వాడుకోవడానికి, ఒడిసా తన వాటాగా వెయ్యి క్యూసెక్కులు వాడుకోవడానికి నిర్ణయి ంచుకున్నాయి. వచ్చే ఏడాది జూన్ (వాటర్ ఇయర్)లోపు ఒడిసా అదనంగా వాడుకున్న నీటిని ఏపీ జెన్కో సరిసమానం చేయడానికి బలిమెల జలాశయం నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో ఇటు ఆంధ్రాలో, అటు ఒడిసాలో బలిమెల జలాశయంపై ఆధారపడ్డ జల విద్యుత్ కేంద్రాలకు నీటి సమస్య తలెత్తే అవకాశం లేదని ఇరు రాష్ట్రాల అధికారులు అభి ప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సీలేరు కాంప్లెక్స్ ఇన్చార్జ్ ముఖ్య ఇంజనీర్ కేవీ నాగేశ్వరరావు, సివిల్ ఎస్ఈ కేవీవీ ప్రశాంత్‌కుమార్, ఈఈ డి.బాబూరావు, ఎగ్జిక్యూటివ్ ఇం జనీర్ జాకీర్ హుస్సేన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. అప్పలనాయుడు, ఒడిసా నుంచి బలిమెల ముఖ్య ఇంజనీర్ చంద్రశేఖర్మిశ్రా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమాశంకర్ సాహు, సూపరింటెండెంట్ ఇంజనీర్ (చిత్రకొండ) రామాకాంత్ పాత్రో, చిత్రకొండ అసిస్టెంట్ ఇంజనీర్ జి.ప్రదీప్, మల్కాన్‌గిరి జనరల్ మేనేజర్ నారాయణ ఛత్రపతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T00:22:25+05:30 IST