ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి ప్రదాత బాలయోగికి ఘన నివాళి

ABN, First Publish Date - 2022-03-04T05:57:42+05:30

దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి 20వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అమలాపురంలోని నల్లవంతెన వద్ద గల బాలయోగి ఘాట్‌లో పలువురు ప్రముఖులతో పాటు టీడీపీకి చెందిన కీలక నాయకులతో సహా వందల సంఖ్యలో కార్యకర్తలు హాజరై బాలయోగికి ఘనంగా నివాళులర్పించారు.

అమలాపురం బాలయోగి ఘాట్‌లో పూలమాలలువేసి నివాళులర్పిస్తున్న శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యంతో సహా పలువురు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమలాపురం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి 20వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అమలాపురంలోని నల్లవంతెన వద్ద గల బాలయోగి ఘాట్‌లో పలువురు  ప్రముఖులతో పాటు టీడీపీకి చెందిన కీలక నాయకులతో సహా వందల సంఖ్యలో కార్యకర్తలు హాజరై బాలయోగికి ఘనంగా నివాళులర్పించారు. బాలయోగి తనయుడు, టీడీపీ అమలాపురం పార్లమెంట్‌ పార్టీ నాయకుడు గంటి హరీష్‌బాలయోగి ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిరాజు, చిల్లా జగదీశ్వరి, ఏజేవీబీ మహేశ్వరరావుతో పాటు మాజీ జడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, మెట్ల రమణబాబు, టీడీపీ నాయకులు పెచ్చెట్టి చంద్రమౌళి, మోకా ఆనందసాగర్‌, నల్లా స్వామి, డొక్కా నాథ్‌బాబు, పెచ్చెట్టి విజయలక్ష్మి, అల్లాడ స్వామినాయుడు, ఉంగరాల వెంకటేశ్వరరావు, సయ్యపరాజు రామకృష్ణంరాజు, బత్తుల సాయి, రాజులపూడి భీముడు, సలాది బాబూరావు, చిక్కాల గణేష్‌లతో పాటు వందల సంఖ్యలో పార్టీ నాయకులు హాజరై బాలయోగికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరీష్‌ మాధుర్‌ ఆధ్వర్యంలో  హరీష్‌తో పాటు మెట్ల రమణబాబు తదితరులు అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయోగి తనయుడు హరీష్‌ మాట్లాడుతూ దివంగత నేత బాలయోగి ఆశయ సాధనకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.  బీజేపీ నాయకులు మోకా వెంకటసుబ్బారావు, అరిగెల వెంకటరామారావుతో పాటు పలువురు నాయకులు ఘాట్‌లో నివాళులర్పించారు. అమలాపురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు, తహశీల్దార్‌ గెడ్డం రవీంద్రనాథ్‌ఠాగూర్‌తో సహా పలువురు అధికారులు బాలయోగి ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
వివేకా హత్య కేసు నిందితులను కాపాడుతున్నదెవరు
మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకుల ప్రమేయం సీబీఐ దర్యాప్తులో బట్టబయలు అవుతున్నప్పటికీ  ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు.  అమలాపురంలోని నల్లవంతెన వద్దగల బాలయోగి ఘాట్‌లో ఈ సందర్భంగా మాట్లాడుతూ హత్య జరిగిన సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌ టీడీపీ నాయకులే వివేకా నందరెడ్డిని హత్య చేయించారని ఆరోపణాస్ర్తాలు సంధించారని ఇప్పుడు  సీబీఐ విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలేమిటో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సొంత చిన్నాన్ననే దారుణంగా చంపించిన వ్యక్తి ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కొనసాగడం తగదన్నారు. ఇప్పటికీ తెలుగు దేశంపై సజ్జలతో  సహా పలువురు నాయకులు తప్పుడు  ఆరోపణలు చేస్తూ చంద్రబాబును నిందిస్తున్నారని ఆనందరావు అన్నారు. దమ్ముంటే వివేకానంద హత్య కేసులో ప్రధాన పాత్రధారుడుగా పేర్కొంటున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  మెట్ల రమణబాబుతో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-04T05:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising