ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టు 15 వేడుకలకు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2022-08-05T05:14:02+05:30

స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లాస్థాయిలో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లాస్థాయిలో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆగస్టు 15 వేడుకలు జరుగుతున్న దృష్ట్యా వేడుకల నిర్వహణపై జిల్లాస్థాయి అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, అడిషనల్‌ ఎస్పీ లతామాధురి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు పాల్గొన్నారు. బాలయోగి స్టేడియంలో కనువిందు చేసే రీతిలో ఆగస్టు 15 వేడుకలు నిర్వహించాలని సూచించారు. జాతీయభావం పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రగతిని తెలిపే విధంగా శకటాల ప్రదర్శన ఉండాలని, ముఖ్యంగా డీఆర్‌డీఏ, డ్వామా, ఐసీడీఎస్‌, సర్వే, అగ్రికల్చర్‌, హౌసింగ్‌, ఫిషరీస్‌, హార్టికల్చర్‌, హెల్త్‌, ఎండోమెంట్‌ శాఖల అధికారులకు సూచించారు. వేడుకలకు వచ్చే ప్రముఖుల కోసం బాలయోగి స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా పార్కింగ్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశం అనంతరం అడిషనల్‌ ఎస్పీ లతామాధురి, డీఆర్వో సత్తిబాబు, ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు కలిసి బాలయోగి స్టేడియంను పరిశీలించి ఏర్పాట్లకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.

Updated Date - 2022-08-05T05:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising