ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో భారం

ABN, First Publish Date - 2022-05-27T07:13:21+05:30

పేదవారు నివసించే తాటాకిల్లు, రెల్లు గడ్డితో కప్పే పూరిగుడిసెలు మొదలుకుని నింగిని తాకే భవంతుల వరకూ అన్ని రకాల నిర్మాణాలపై మార్కెట్‌ విలువలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నిర్మాణాలపై మార్కెట్‌ విలువల పెంపు 
  • జూన్‌ 1 నుంచి అమలు
  • సామాన్యులపై అదనపు భారం

సామర్లకోట, మే 26: పేదవారు నివసించే తాటాకిల్లు, రెల్లు గడ్డితో కప్పే పూరిగుడిసెలు మొదలుకుని నింగిని తాకే భవంతుల వరకూ అన్ని రకాల నిర్మాణాలపై మార్కెట్‌ విలువలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 1 నుంచి పెంచిన మార్కెట్‌ విలువలు అమలులోకి రానున్నాయి. చిన్న ఇల్లు కొనుక్కో వాలనుకునే పేద, మధ్య తరగతి వారితోపాటు అపార్ట్‌మెంట్లు కొనుక్కోవాలనుకునే ఉద్యోగ, వ్యా పార వర్గాలకు ఇకనుంచి రూ.వేలల్లో భారం పడ నుంది. కోళ్లఫారాలు, సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలపైనా మార్కెట్‌ విలువలు పెరగ ను న్నాయి. గ్రామ పంచాయతీలు, మేజర్‌ పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పెరగనున్న మార్కెట్‌ విలువలపైనే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, వసూలు చేయనున్నారు. భవన నిర్మా ణాలు ఎక్కువగా జరిగే పట్టణ ప్రాంతాలు, మేజర్‌ పంచాయతీల్లో ఈ పెంపువల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్ప టికే పెరిగిన మార్కెట్‌ విలువలతో సతమతమవుతున్న ప్రజలు మళ్లీ విలు వలు పెంచనుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల విభజనకు పూర్వం తూర్పుగోదావరి జిల్లాగా ఉండే కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాల య పరిధిలో 14 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండేవి. కాగా ఇటీవల కాకి నాడ జిల్లా విభజనతో అవి 9సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పరిమితమైంది. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో సామర్లకోట, సర్పవరం, కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవు, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని ప్రాంతాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. నిర్మాణాలపై మార్కెట్‌ విలువల పెంపు ఉత్తర్వులు అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అందా యని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాధికారి ఆంధ్రజ్యోతికి గురువారం తెలిపారు. ఈ ఉత్తర్వులను జూన్‌ 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు.

Updated Date - 2022-05-27T07:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising