ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ ఆర్చరీ పోటీలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-25T06:57:49+05:30

కోరుకొండ మండలం గాడాల లారల్‌ హైగ్లోబల్‌ స్కూల్‌లో మంగళవారం 4వ ఎన్‌టీపీసీ అండర్‌-9 జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోరుకొండ, మే 24: కోరుకొండ మండలం గాడాల లారల్‌ హైగ్లోబల్‌ స్కూల్‌లో మంగళవారం 4వ ఎన్‌టీపీసీ అండర్‌-9 జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను శాప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, ఇండియన్‌ ఆర్చరీ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ప్రమోద్‌ చందూకర్‌ జాతీయ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలు ఈనెల 30వ తేదీ వరకు జరుగుతాయని ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ నల్లా ప్రభాకర్‌  తెలిపారు. అండర్‌-9 విభాగంలో దేశం నలుమూలల నుంచి 319 మంది బాలబాలికలు పాల్గొన్నారు. తొలిరోజు పోటీల్లో ఇండియన్‌ రూడ్స్‌, రెగ్యుర్‌ కాంపౌండ్‌ విభాగాల్లో ర్యాంకింగ్‌ పూర్తిచేశారు. అదే విధంగా రికర్వ్‌, టీం ఎలిమినేషన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.పద్మనాభం, తెలంగాణ ఆర్చరీస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సంజీవరెడ్డి, పోటీల ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ రాంప్రసాద్‌, ప్రెసిడెంట్‌ నల్లా ప్రభాకర్‌, కర్రి నాగబాబు, కర్రి శేఖర్‌, జొన్నలగడ్డ గోపాలకృష్ణ, ఈదిపల్లి మిథున్‌, పి.లక్ష్మణరావు, టోర్నమెంట్‌ డైరెక్టర్‌ శ్రవణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T06:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising