ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అపశృతులు

ABN, First Publish Date - 2022-09-13T06:46:50+05:30

పిఠాపురం, సెప్టెంబరు 12: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గణేష్‌ నిమజ్జనంలో అపశృతులు జరిగి పలువురి ప్రాణాలు కోల్పోవడానికి కారణమె ౖందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. కొత్తపల్లి మండలంలోని సముద్రతీరం, పిఠాపురం మండలంలోని నవఖండ్రవాడ వద్ద గోదావరి కాలువలో వినాయకులను నిమజ్జనం చేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి

పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ 

పిఠాపురం, సెప్టెంబరు 12: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గణేష్‌ నిమజ్జనంలో అపశృతులు జరిగి పలువురి ప్రాణాలు కోల్పోవడానికి కారణమె ౖందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. కొత్తపల్లి మండలంలోని సముద్రతీరం, పిఠాపురం మండలంలోని నవఖండ్రవాడ వద్ద గోదావరి కాలువలో వినాయకులను నిమజ్జనం చేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆయన సోమవారం పరామర్శించారు. నిమజ్జన సమయం లో తగు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎమ్మెల్యే, అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. గజ ఈతగాళ్లు, బోట్లును అందుబాటులో ఉంచలేదని, తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదాలు జరిగి ఉండేవికావన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరికి రూ.25లక్షలు వంతున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ పట్టణ, మండలశాఖల అధ్యక్షులు రెడ్డెం భాస్కరరావు, అనిశెట్టి సత్యానందరెడ్డి,  పిల్లి చిన్నా, బర్ల అప్పారావు, కోళ్ల బంగారుబాబు, వేణుం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


రౌడీలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

కోనపాపపేట (కొత్తపల్లి) సెప్టెంబరు 12: వైసీపీ ప్రభుత్వం రౌడీ, గుండాల్లా వ్యవహరిస్తుందని టీడీ పీ రాష్ట్ర అధికార ప్రతినిఽధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ అన్నారు. పొన్నాడ శివారు కోనపాపపేటలో సోమవారం బాదుడే బాదుడే కార్యక్రమం  ని ర్వహించారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. మండలా ధ్యక్షుడు ఆనిశెట్టి సత్యానందరెడ్డి, మాజీ సర్పంచ్‌ కొర్ని వెంకటరమణ, కె.శ్రీను, సూరాడ శ్రీను, పల్లేటి శ్రీను, గంపల తాతారావు, ఎరిపల్లి మారయ్య, కొర్లయ్య, సుబ్బారావు, గంగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-13T06:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising