ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతబాబు అమాయకుడట

ABN, First Publish Date - 2022-06-07T06:50:09+05:30

డ్రైవర్‌ను హత్య చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అమాయకుడని, ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు లాయర్‌ జిల్లా అట్రాసిటీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయన్ను తప్పుడు కేసులో ఇరికించారు

 రాజకీయ ప్రత్యర్థులు9 దీని వెనుక ఉన్నారు 

 బెయిల్‌ పిటీషన్‌లో పేర్కొన్న అనంతబాబు న్యాయవాది 

 కాగా అరెస్ట్‌ సమయంలో హత్య తానే చేశానని అంగీకరించిన అనంతరబాబు 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

డ్రైవర్‌ను హత్య చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అమాయకుడని, ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు లాయర్‌ జిల్లా అట్రాసిటీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి కొన్నిరోజుల కిందట అట్రాసిటీ న్యాయస్థానంలో పిటిషన్‌ లిస్ట్‌ అయింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం ఎమ్మెల్సీ అనంతబాబును అన్యాయంగా డ్రైవర్‌ హత్య కేసులో ఇరికించారని పేర్కొన్నారు. అనంతబాబుకు ఉన్న పరపతిని దెబ్బతీయడానికే రాజకీయ ప్రత్యర్థులు అనవసరంగా కేసులోకి లాగారని అందులో పేర్కొన్నారు. పూర్తిగా కక్షపూరితంగా ఇదంతా జరిగిందని, అందుకే బెయిల్‌ మంజూరు చేయాలంటూ పిటిషన్‌లో వివరించారు. జరిగిన హత్యతో అనంతబాబుకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన నిర్దోషి అని పేర్కొన్నారు. కాగా డ్రైవర్‌ను తానే హత్యచేశానని ఇది వరకే అరెస్టు సమయంలో పోలీసుల సమక్షంలో అనంతబాబు అంగీకరించారు. హత్య చేసిన ప్రదేశానికి పోలీసులు అనంతబాబును తీసుకువెళ్లి విచారించినప్పుడు కొట్టి చంపిన కర్రను, కట్టేసిన తాడును చూపించాడు. తీరా ఇప్పుడు తనకేం తెలియదని, హత్యతో సంబంధం లేదని బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొనడం విశేషం. అనంతబాబును కస్టడీలోకి తీసుకుని విచారించే విషయంలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా మారింది. రిమాండ్‌కు తరలించిన ఒకటి రెండు రోజుల తర్వాత కస్టడీ కోరాల్సి ఉ న్నా ఆ ప్రయత్నాలేవీ చేయలేదు. పైగా అరెస్ట్‌ తర్వాత విధించిన 14రోజుల రిమాండ్‌ సోమవారంతో ముగిసిపోయింది. తిరిగి మరో పద్నాలుగు రోజుల రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది.

Updated Date - 2022-06-07T06:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising