ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ విచారణ

ABN, First Publish Date - 2022-05-24T06:13:02+05:30

అన్నవరం దేవస్థానంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ గతేడాది డిసెంబరులో అప్ప టి పాలకమండలి సభ్యుడు ఫిర్యాదుమేరకు విచారణ చేపట్టి తనిఖీలు చేసిన విజిలెన్స్‌ అధికారులు తాజాగా సోమవారం మరో సారి విచారణ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, మే 23: అన్నవరం దేవస్థానంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ గతేడాది డిసెంబరులో అప్ప టి పాలకమండలి సభ్యుడు ఫిర్యాదుమేరకు విచారణ చేపట్టి తనిఖీలు చేసిన విజిలెన్స్‌ అధికారులు తాజాగా సోమవారం మరో సారి విచారణ నిర్వహించారు. దేవస్థానం చైర్మన్‌ రోహిత్‌తో పాటు ఆ సమయంలో ట్రస్టీలుగా వ్యవహరించిన వ్యక్తుల నుంచి ఆరోపణలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. లిఖితపూర్వకంగా సమా చారం తీసుకుని వారి నుంచి సంతకాలు సేకరించారు. ఈ విచారణకు ఆరుగురు ట్రస్టీలు మాత్రమే హాజరుకాగా నలుగురు ఒకరకంగా, ఇద్దరు మరోరకంగా స్టేట్‌మెంట్‌ అందించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీనికి సంబంధించి విజిలెన్స్‌ ఎస్పీ పి.రవికుమార్‌ మాట్లాడుతూ మొత్తం 25 అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటికే వీటికి సంబంధించి కీలక డాక్యుమెంట్‌లు తీసుకున్నామని ప్రస్తుతం ట్రస్టీలను సాక్ష్యులుగా చేసి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నామని చెప్పారు. వారిలో తప్పు చేసిన వారు ఉండవచ్చు, లేకపోవచ్చునని వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి నివేదికను మూడునెలల్లో సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఈ విచారణలో విజిలెన్స్‌ డీఎస్పీ ముత్యాలనాయుడు, సీఐ టి.శ్రీనివాసరెడ్డి, ఏవో టి.భార్గవమహేష్‌ పాల్గొనగా, విచారణకు పూర్వపు ట్రస్టీలు వాసిరెడ్డి జగన్నాథం, గాదె రాజశేఖరరెడ్డి, ముత్యాల వీరభద్రరావు, కర్రి బామిరెడ్డి, బదిరెడ్డి ఆశాలత, కొండవీటి సత్యనారాయణ హాజరయ్యారు.

Updated Date - 2022-05-24T06:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising