ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్యదేవుని ఆదాయం రూ.19.94 కోట్లు

ABN, First Publish Date - 2022-11-25T00:31:50+05:30

రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఈ ఏడాది కార్తీకమాసంలో భక్తులు అధిక మొత్తంలో కానుకలు సమర్పించారు. అక్టోబరు 26న ప్రారంభమైన కార్తీకమాసం నవంబరు 23తో ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, నవంబరు 24: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఈ ఏడాది కార్తీకమాసంలో భక్తులు అధిక మొత్తంలో కానుకలు సమర్పించారు. అక్టోబరు 26న ప్రారంభమైన కార్తీకమాసం నవంబరు 23తో ముగిసింది. ఈనెల రోజులు సత్యదేవుడి సన్నిధికి లక్షలాదిగా రెండు తెలుగురాష్ట్రాల నుంచి అశేషసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది కార్తీకమాసంలో స్వామివారికి రికార్డుస్థాయిలో అన్ని విభాగాల ద్వారా రూ.19,94,57,109 ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే సత్రం గదుల ఆదాయం సుమారు 9 లక్షలు తగ్గింది. కార్తీకమాస ఆదాయంలో వ్రత టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.7,75,64,813 కోట్లు , స్వామివారి ప్రసాదాల విక్రయం ద్వారా రూ.4,68,30,565, భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలు రూ. 3,11,13,199 కోట్లు వచ్చాయి. సత్రం గదుల అద్దెల ద్వారా గతేడాది రూ. 82.65 లక్షలు లభించగా ఈ ఏడాది సుమారు 9లక్షల ఆదాయం కోల్పోయి రూ.73.39లక్షలు మాత్రమే లభించింది. ప్రత్యేక దర్శనాల నుంచి రూ. 73.83 లక్షలు, కొబ్బరిముక్కలు విక్రయం ద్వారా 14.07 లక్షలు, కేశఖండన శాల ద్వారా రూ.10.62 లక్షలు, స్వామివారి నిత్యకల్యాణం టిక్కెట్ల విక్రయాలు ద్వారా రూ.8.87 లక్షలు సమకూరాయి. రవాణావిభాగం ద్వారా రూ.21.73 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గతేడాది అన్ని విభాగాల ద్వారా రూ.18.95 కోట్లు ఆదాయం రాగా ఈఏడాది సుమారు కోటిరూపాయలు అధికంగా లభించిందని ఈవో సత్యనారాయణ మూర్తి తెలిపారు.

Updated Date - 2022-11-25T00:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising