త్వరలో అన్నవరంలో నగదు రహిత లావాదేవీలు
ABN, First Publish Date - 2022-12-15T23:43:57+05:30
అన్నవరం దేవస్థానంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా త్వరలో నగదు రహిత లావాదేవీలను నైన్ అండ్ నైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్నవరం దేవస్థానం అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
అన్నవరం, డిసెంబరు 15: అన్నవరం దేవస్థానంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా త్వరలో నగదు రహిత లావాదేవీలను నైన్ అండ్ నైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్నవరం దేవస్థానం అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దాడిశెట్టి రాజా, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ పాల్గొన్నారు. అన్నవరం దేవస్థానంలో గదుల కొరతను దృష్టిలో ఉంచుకుని మరో 200 గదులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రతి విభాగంలో ఏఈవోలు రోస్టర్ విధానంలో మారతారని ఏ విభాగంలో తప్పు జరిగినా ఆయా విభాగాల ఏఈవోలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో అన్నవరం దేవస్థానం ఈవో సత్యనారాయణమూర్తి, చైర్మన్ రోహిత్, సహాయ కమిషనర్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:44:00+05:30 IST