ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నగారికి ‘వంద’ కిలోల కేకు..!

ABN, First Publish Date - 2022-05-29T07:04:58+05:30

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు ఆలమూరు మండలంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా గుమ్మిలేరులో వంద కిలోల కేక్‌ను కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలమూరు, మే 28: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు ఆలమూరు మండలంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండలంలో ఆలమూరు, గుమ్మిలేరు, జొన్నాడ, మడికి, చొప్పెల్ల, మోదుకూరు, చింతలూరు, పెదపళ్ల గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గుమ్మిలేరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, శతజయంతి సందర్భంగా వందకిలోల కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం 60 మంది ఉత్తమ రైతులు, గ్రామపెద్దలు, వివిధ సంఘాల నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమం లో రెడ్డి రుద్రయ్యచౌదరి, రెడ్డి రాజేష్‌, ముత్యాల భాస్కరరావు, గుణ్ణం శ్రీనివాస్‌, కోరా వీరభద్రరావు, రెడ్డి సత్తిబాబు, రెడ్డి రామారావు పాల్గొన్నారు. ఆలమూరులో జరిగిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో వంటిపల్లి సతీష్‌కుమార్‌, ఈదల నల్లబాబు, ఈదల సత్తిబాబు, రాంబాబు, కడియాల శ్రీను, వంటిపల్లి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వంటిపల్లి మురళీకృష్ణ ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన జరిగింది. 



Updated Date - 2022-05-29T07:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising