పన్నుల వసూళ్లలో అమలాపురం మున్సిపాలిటీ ‘స్టేట్ ఫస్ట్’
ABN, First Publish Date - 2022-04-08T06:02:36+05:30
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నుల వసూళ్లలో అమలాపురం పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపిన సిబ్బందిని మున్సి పల్ కమిషనరు వి.అయ్యప్పనాయుడు గురువారం ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
అమలాపురం టౌన, ఏప్రిల్ 7: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నుల వసూళ్లలో అమలాపురం పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపిన సిబ్బందిని మున్సి పల్ కమిషనరు వి.అయ్యప్పనాయుడు గురువారం ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. 85శాతం మేర ఇంటి పన్నులు వసూలు చేసిన రెవెన్యూ సిబ్బంది, సచివాలయ, వార్డు, అడ్మిన కార్యదర్శులకు మెమెంటోలు అందజేసి సత్కరించారు. ఈ నెలాఖరులోపు ఇంటి, నీటి పన్నులు చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీ ఇస్తామని కమిషనరు చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ శ్రీలక్ష్మి, రెవెన్యూ ఇనస్పెక్టర్లు పి.వెంకటేశ్వరరావు, వి.రాజీవ్, సిబ్బంది కేపీ ప్రసన్నవదన, కె.లక్ష్మీనారాయణ, మున్సిపల్ డీఈ కె.అప్పలరాజు, టీపీవో త్రినాథ్, కె.రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2022-04-08T06:02:36+05:30 IST