ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లూరి చరిత్ర భావితరాలకు స్ఫూర్తి

ABN, First Publish Date - 2022-07-05T07:15:44+05:30

రాజమహేంద్రవరం సిటీ, జూలై 3 : స్వాతంత్య్ర సంగ్రామంలో మన్యంవీరుడు, విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చూపించిన ధైర్య సాహసాలు, ప్రాణత్యాగం భావితరాలకు స్ఫూర్తినిస్తాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి రాజమహేంద్రవరం గోదావరి బండ్‌ రోడ్డులో అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభధ్రరావు ఆధ్వర్యంలో జ

గోదావరి బండ్‌ రోడ్డులో అల్లూరి విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ మాధవీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత 

రాజమహేంద్రవరం సిటీ, జూలై 3 : స్వాతంత్య్ర సంగ్రామంలో మన్యంవీరుడు, విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చూపించిన ధైర్య సాహసాలు, ప్రాణత్యాగం భావితరాలకు స్ఫూర్తినిస్తాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి రాజమహేంద్రవరం గోదావరి బండ్‌ రోడ్డులో అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభధ్రరావు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్‌ మాధవీలత, రూడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, కమిషనర్‌ దినేష్‌కుమార్‌ ముఖ్యఅతిఽథులుగా పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 27 ఏళ్లు మాత్రమే జీవించారని, కానీ ఆంగ్లేయులను ఎదిరించి వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి చూపించిన ధైర్యం, సాహసం, ఆత్మవిశ్వాసం ఎనలేనివన్నారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన పై ఉందన్నారు. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఒక జిల్లాకు అల్లూరి పేరుపెట్టిందని, ఆ మహనీయుడి జయంతిని అధికారికంగా జరుపుతోందని చెప్పారు. అల్లూరి చరిత్ర తెలిసేవిధంగా ఫొటోల ప్రదర్శనశాల ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం పడాల వీరభద్రరావు మాట్లాడుతూ అల్లూరి 125వ జయంతిని సందర్భంగా రాజమహేంద్రవరం పాత రైలు వంతెనకుగాని, మధురపూడి ఎయిర్‌పోర్టుకుగాని అల్లూరి పేరు పెట్టాలని, అలాగే అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుచేయాలని కోరారు. దీనికి కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. అనంతరం విభూది బ్రదర్స్‌ ప్రదర్శించిన అల్లూరి వేషధారణ సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్‌ వైసీపీ కోఆర్డినేటర్‌ చందన నాగే శ్వర్‌, నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, యువజన సంఘం కార్యదర్శి చీకట్ల శివనారాయణ, సభ్యులు యర్రా ఉమామహేశ్వరావు, ఎస్‌ఎస్‌ రాఘవేంద్ర, శ్యామల, పార్వతి, కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T07:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising