ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖరీఫ్‌ పూర్తి కాలేదు.. రబీ సాగడంలేదు!

ABN, First Publish Date - 2022-12-16T00:13:01+05:30

జిల్లాలో రబీ సీజన్‌ మొదలైంది. కానీ ఇంకా ఖరీఫ్‌ కోతలు పూర్తి కాలేదు. ధాన్యమూ పూర్తిగా కొనుగోలు జరగలేదు.దీంతో రైతాంగం ఖరీఫ్‌ అప్పులు తీర్చలేక.. రబీకి పెట్టుబడి పెట్టలేక సతమతమవుతున్నారు.

నాట్లు వేస్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా మండలాల్లో ఆరంభం కాని వైనం

రూ. 300 కోట్ల వరకూ సొమ్ములు పెండింగ్‌

ఇంకా రైతుల ఖాతాల్లో పడని సొమ్ములు

అయోమయంలో అన్నదాతలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రబీ సీజన్‌ మొదలైంది. కానీ ఇంకా ఖరీఫ్‌ కోతలు పూర్తి కాలేదు. ధాన్యమూ పూర్తిగా కొనుగోలు జరగలేదు.దీంతో రైతాంగం ఖరీఫ్‌ అప్పులు తీర్చలేక.. రబీకి పెట్టుబడి పెట్టలేక సతమతమవుతున్నారు.అయితే నేలతల్లిని నమ్ముకున్న రైతు కన్నీటితోనే రబీ సాగుకు సిద్ధమవుతున్నాడు. జిల్లాలో మొత్తం 18 మండలాల పరిధిలో 56,433 హెక్టార్లలో రబీ సాగుకు అధికారులు అనుమతి చ్చారు.గత నెల 29వ తేదీన డెల్టా కాలువలకు నీరు విడుదల చేశారు.ఈ నేపథ్యంలో జిల్లాలో 965 హెక్టార్లలో నారుమడులు వేశారు. కోరుకొండ మండలం తప్ప మిగిలిన అన్ని మండలాల్లోనూ నారుమళ్లు ఆరంభమయ్యాయి.కానీ అది కొద్ది శాతమే. కడియం, రాజానగరం, అనపర్తి, బిక్కవోలు, రాజమహేంద్రవరం రూరల్‌,సీతానగరం,కొవ్వూరు,నిడదవోలు మండ లాల్లో 1859 హెక్టార్లలో రబీ నాట్లు వేశారు.మిగతా మండలాల్లో ఇంకా ఆరంభం కాలేదు. జిల్లాలో 3 శాతం రబీ పనులు జరిగాయి. కోరుకొండలో మొత్తం 1786 హెక్టార్లకు అనుమతి ఉండగా ఇంత వరకూ ఒక హెక్టారులో కూడా నారుమడి వేయలేదు.జిల్లాలో రబీ నాట్లు ఆలస్యంగా సాగు తుండడంతో పూర్తయ్యే సరికి సంక్రాంతి దాటేస్తుందేమోననే ఆందోళన రైతాంగంలో ఉంది.ఇలా ఆలస్యమైతే మార్చి 31వ తేదీ నాటికి కాలువలు మూసివేయడానికి వీలుకాదు. దాంతో ఎండాకాలంలో ఇరిగేషన్‌ పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కోతల సమయానికి ఎండలు ముదిరిపోతాయి.

కోతలు పెండింగ్‌.. సొమ్ములు పడలేదు..

రబీ నెమ్మదిగా మొదలైనప్పటికీ, ఖరీఫ్‌ కోతలు ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల మాండస్‌ తుఫాన్‌ ప్రభావం లేకపోతే కోతలు పూర్తయ్యేవి. ఇప్పటి వరకూ జిల్లాలో 91 శాతం కోతలు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 73,606 హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు చేశారు. కానీ ఇంత వరకూ 66,819 హెక్టార్లలో కోతలు అయ్యాయి.కోరుకొండ మండలంలో 57 శాతం, గోకవరగంలో 56, రంగంపేటలో 85 శాతం కోతలు అయ్యాయి. మిగతా చోట్ల పూర్తయ్యాయి. జిల్లాలో 3.23 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా బుధవారం వరకూ 1,66,369.440 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. అంటే సుమారుగా సేకరణ లక్ష్యంలో సగం వరకూ అయింది. ఇంకా చాలా ఉంది. కొనుగోలు చేసిన ధాన్యం విలువ సుమారు రూ.400 కోట్ల వరకూ ఉండగా రూ.109 కోట్లు చెల్లించారు. ధాన్యం కొనుగోలు చేసిన సొమ్ములు త్వరగా ఇస్తేనే రైతు ఆనందంగా రబీ పండించగలడు. అయితే సొమ్ముల విడుదలలో జాప్యం కారణంగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి, ఖరీఫ్‌ బాకీలు తీర్చడానికి రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.ఇక కౌలు రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

Updated Date - 2022-12-16T00:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising