ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ జోలికొస్తే బూడిదే

ABN, First Publish Date - 2022-08-14T07:38:57+05:30

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్క ర్‌తో పోలిస్తే గడ్డిపోచవు నీవు. ఆయన జోలికి వస్తే బూడిదైపోతావని ముఖ్య మంత్రి జగన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు.

సీపీఐ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌పై విరుచుకుపడిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అమలాపురంలో సీపీఐ జిల్లా మహాసభలు ప్రారంభం

అమలాపురం టౌన్‌, ఆగస్టు 13 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్క ర్‌తో పోలిస్తే గడ్డిపోచవు నీవు. ఆయన జోలికి వస్తే బూడిదైపోతావని ముఖ్య మంత్రి జగన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. విదేశీ విద్య చదువుకునే విద్యార్థులకోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెడితే ఆ పేరు తీసేసి నీ పేరు పెట్టుకుంటావా అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ చదివిన పుస్తకాల అట్టలైనా చూశావా నీవు అని జగన్‌ను ప్రశ్నించారు. అన్ని జిల్లాలతోపాటు కోనసీమ జిల్లాకు ముందుగానే అంబేడ్కర్‌ పేరును పెట్టి ఉంటే ఇన్ని అల్లర్లు జరిగేవి కావన్నారు. ఇప్పటికైనా కోనసీమలో సామరస్య వాతావరణం సృష్టించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ కోనసీమ జిల్లా మహాసభలు శనివారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో ప్రారంభమయ్యాయి. తొలిరోజు జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు ఆధ్వర్యంలో సీపీఐ నేతలు, కార్యకర్తలు బస్టాండు సెంటర్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు సత్తిబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శించారు. అటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ప్రమాదకర పరిస్థితులు నెల కొన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కమ్యూనిస్టులంతా పోరా టాలకు సిద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లా డుతూ కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాల న్నారు. నెలరోజుల వ్యవధిలోనే రెండుసార్లు గోదావరికి వరదలు రావడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, వారిని తక్షణం ఆదుకునేవిధంగా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు, జిల్లా సహాయ కార్యదర్శులు దేవ రాజేంద్రప్రసాద్‌, పెద్దిరెడ్డి రాము, వాసంశెట్టి సత్తిరాజు, గొట్టాపు రమణి, వెంకటలక్ష్మి, మోకా శ్రీనివాసరావు, కామిరెడ్డి చంద్రరావు, కుంపట్ల వరుణ్‌బాబు, కేశవశెట్టి పాల్గొన్నారు.



Updated Date - 2022-08-14T07:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising