ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధ్వంసం

ABN, First Publish Date - 2022-05-23T06:42:08+05:30

కోనసీమ జిల్లా కోసం తన అభిప్రాయాన్ని వాట్సాప్‌ స్టేటస్‌లోపెట్టాడని మండలంలోని ఖండ్రిగ బీసీ పేటలో ఒక యువకుడి ఇంటిపై ఒక సామాజికవర్గానికి చెందిన సుమారు 40 మంది యువకులు దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది.

ధ్వంసమైన ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కోనసీమ జిల్లా కోసం వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడని యువకుడి ఇల్లు ముట్టడి 
  • అతడు లేకపోవడంతో తల్లి, పెద్దమ్మలపై దాడి
  • కొత్తపేట మండలం ఖండ్రిగ బీసీ పేటలో ఘటన

కొత్తపేట, మే 22: కోనసీమ జిల్లా కోసం తన అభిప్రాయాన్ని వాట్సాప్‌ స్టేటస్‌లోపెట్టాడని మండలంలోని ఖండ్రిగ బీసీ పేటలో ఒక యువకుడి ఇంటిపై ఒక సామాజికవర్గానికి చెందిన సుమారు 40 మంది యువకులు దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టిన యువకుడు ఇంటి వద్ద లేకపోవడంతో అతడితల్లి, పెద్దమ్మలపై దాడి చేసి ఇంట్లో వస్తువులతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న రావులపాలెం సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్‌ఐ వి.మణికుమార్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. గాయపడ్డ మహిళలను కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఖండ్రిగ గ్రామానికి చెందిన బొక్కా రాజేష్‌ తన వాట్సాప్‌ స్టేటస్‌లో కోనసీమ జిల్లాగానే  పేరు ఉంచాలంటూ మెసేజ్‌ పెట్టడంతో ఆగ్రహానికి లోనైన ఓవర్గం యువకులు ఆదివారం అతడి ఇంటిని చుట్టుముట్టారు. మీ అబ్బాయి ఎక్కడం టూ తల్లి పద్మను అడగ్గా... తన కుమారుడు ఇంటివద్ద లేడని చెప్పిన ఆమెను, అడ్డు వచ్చిన తోటికోడలైన లక్ష్మిలను గాయపరిచారు. దీంతో వారిని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మణికుమార్‌ తెలిపారు.  

Updated Date - 2022-05-23T06:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising