భక్తులు తగ్గారన్నది అవాస్తవం : ఈవో బ్రమరాంబ
ABN, First Publish Date - 2022-12-31T12:57:07+05:30
బెజవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్‌ను దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ఆవిష్కరించారు.
విజయవాడ : బెజవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్‌ను దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ఆవిష్కరించారు. భవానీ దీక్షల విరమణలు 6 రోజుల పాటు దిగ్విజయంగా జరిగాయన్నారు. అన్ని శాఖల సమన్వయంతో దీక్షల విరమణలు విజయవంతమయ్యాయన్నారు. భక్తులు తగ్గారన్నది అవాస్తవమన్నారు. గతం కంటే అదనంగానే భక్తులు అమ్మను దర్శించుకున్నారన్నారు. 5 లక్షల 40 వేల మంది భవానీ భక్తులు అమ్మను దర్శించుకున్నారన్నారు. గతేడాది కంటే రెండు లక్షల లడ్డూలు అదనంగా అమ్ముడయ్యాయని భ్రమరాంబ తెలిపారు. భవానీ దీక్షల విరమణల ఏర్పాట్లకు రూ.6 కోట్లు ఖర్చు అయ్యాయన్నారు. వచ్చిన ఆదాయం ఏడున్నర కోట్లు అని తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం వల్ల ఖర్చు పెరిగిందన్నారు. వచ్చే ఏడాదికి మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా శాశ్వతమైన ఏర్పాట్లు చేస్తామని బ్రమరాంబ వెల్లడించారు.
Updated Date - 2022-12-31T12:57:09+05:30 IST