ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాధవ్‌ కేసును సీబీఐకి ఇచ్చే దమ్ముందా?: అచ్చెన్న

ABN, First Publish Date - 2022-08-11T08:20:48+05:30

మాధవ్‌ కేసును సీబీఐకి ఇచ్చే దమ్ముందా?: అచ్చెన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ మాధవ్‌ అసభ్య వీడియో విషయంలో ఏపీ పోలీసులు తలుచుకుంటే ఈ విషయాన్ని తేల్చడం సులభమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం ట్విటర్‌లో ఆయన స్పందించారు. ‘‘నిజాన్ని తేల్చడం కష్టం అంటే కేసును సీబీఐకి ఇవ్వండి. ఆ దమ్ముందా? మీ వల్ల కాకపోతే కనీసం అదైనా చేయండి. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అనంతపురం ఎస్పీ నిజాన్ని దాచే ప్రయత్నం చేశారు. ఎంపీ మాధవ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు’’ అని అచ్చెన్న ఆరోపించారు. కాగా, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా అది ఒరిజనల్‌ వీడియో కాదని ఎస్పీ ఎలా చెపుతారంటూ తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి ప్రశ్నించారు. మాధవ్‌ను సస్పెండ్‌ చేస్తే ప్రజల్లోకి వైసీపీపై తప్పుడు సంకేతాలు వెళ్తాయనే సజ్జల ద్వారా ఎస్పీతో తప్పుడు ప్రకటన చేయించారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు విమర్శించారు. సత్యాన్ని ప్రభుత్వమే సమాధి చేస్తోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. 

Updated Date - 2022-08-11T08:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising