ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణం విడిచాడే కానీ.. పామును వదల్లేదు!

ABN, First Publish Date - 2022-09-25T09:41:59+05:30

పాము, తేలు కాటుకు మంత్రం వేసి ఎందరికో ప్రాణం పోసిన వ్యక్తే చివరకు పాము కాటుకు బలైన విషాద సంఘటన ఇది. కృష్ణా జిల్లా గుడిదిబ్బ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామును పట్టుకొనేందుకు వెళ్లి.. కాటుకు బలి

ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం


కృత్తివెన్ను, సెప్టెంబరు 24 : పాము, తేలు కాటుకు మంత్రం వేసి ఎందరికో ప్రాణం పోసిన వ్యక్తే చివరకు పాము కాటుకు బలైన విషాద సంఘటన ఇది. కృష్ణా జిల్లా గుడిదిబ్బ గ్రామానికి చెందిన దివంగత కొండూరి గోపాల కృష్ణశాస్ర్తి పెద్ద కుమారుడు నాగబాబు (45) హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ, తరచూ ఇక్కడికి వచ్చి ప్రజలకు తన తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని పౌరోహిత్యం, పూజలు, పాముకాటుకు వైద్యం వంటి సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో.. శనివారం ఉదయం మండల పరిధిలోని పీతలావలోని ఓగోడౌన్‌లో ప్రవేశించిందని సమాచారం అందగా అక్కడకు వెళ్లారు. త్రాచు పామును పట్టుకొనే క్రమంలో అది నాగబాబును కాటేసింది. అయినప్పటికీ పామును పట్టి, వేరే చోట వదిలిన నాగబాబును బంధువులు వెంటనే వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎందరినో పాము కాటు నుంచి కాపాడిన వ్యక్తే అదే పాము కాటుకు బలి కావటంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

Updated Date - 2022-09-25T09:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising