ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం

ABN, First Publish Date - 2022-10-17T10:22:59+05:30

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనుంది. దీపావళి రోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా మలయప్పస్వామిని దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసే సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి విష్వక్సేనులస్వామిని కూడా స్వామికి ఎడమ పక్క మరో పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేపు చేస్తారు. తర్వాత స్వామికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలు అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దాంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సహస్రదీపాలంకరణసేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ.. భక్తులకు దర్శనమిస్తారు. కాగా, దీపావళి ఆస్థానం సందర్భంగా ఆరోజు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవలను టీటీడీ రద్దు చేసింది.

Updated Date - 2022-10-17T10:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising