ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీవ్ర భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి

ABN, First Publish Date - 2022-06-02T17:13:28+05:30

సినీ నటి దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నిన్న(బుధవారం) టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం చాలా ఆనందంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సినీ నటి దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నిన్న(బుధవారం) టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం చాలా ఆనందంగా దివ్యవాణి మీడియాతో మాట్లాడారు. ఇక సమస్య సమసిపోయినట్టే అనుకుంటున్న తరుణంలో తెల్లారేసరికి షాక్ ఇచ్చారు. తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే మంగళవారం తన రాజీనామా విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించిన దివ్యవాణి తరువాత దానిని తొలగించారు. ఆ తరువాత నిన్న చంద్రబాబుతో భేటీ అయ్యారు. మళ్లీ నేటి ఉదయం రాజీనామా ప్రకటన చేస్తూ వీడియో విడుదల చేశారు.


అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. ప్రారంభంలో ఆనందంగానే కనిపించిన దివ్యవాణి క్షణాల్లోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. బుద్ధి లేని వాళ్లు.. బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్యాకేజీ అందిందని.. అందుకే రాజీనామా చేయడం లేదంటున్నారని పేర్కొన్నారు. చివరి నిమిషం వరకూ క్లారిటీ తీసుకునేందుకే ఆగానని దివ్యవాణి తెలిపారు.



Updated Date - 2022-06-02T17:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising