ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని జిల్లాల్లో ప్రజల మధ్య వివాదాలు పెట్టారు: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-01-29T23:55:53+05:30

అన్ని జిల్లాల్లో ప్రజల మధ్య వివాదాలు పెట్టారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అన్ని జిల్లాల్లో ప్రజల మధ్య వివాదాలు పెట్టారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాల విభజన రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినదని, ఎవరితో చర్చించకుండా ఆగమేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చారని తప్పుబట్టారు. ఆన్‌లైన్‌లో కేబినెట్‌ ఆమోదం తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిదని విమర్శించారు. రాజకీయ కోణంలోనే హిందూపురంను జిల్లా కేంద్రంగా పెట్టలేదని దుయ్యబట్టారు. మిశ్రా కమిషన్ నివేదికను ఎందుకు దాచి పెడుతున్నారని ప్రశ్నించారు. అర్ధరాత్రి జీఓలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వంలో అంతా సజ్జల మయంగా మారిందని విమర్శించారు. మంత్రులు అంతా తోలు బొమ్మలుగా మారారని ఎద్దేవాచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటించాలని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2022-01-29T23:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising