ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానులపై దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి

ABN, First Publish Date - 2022-09-15T09:34:01+05:30

మూడు రాజధానులపై దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్‌

అమరావతి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల నినాదంపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల ముందుకు రావాలని తెలుగుదేశం శాసనసభాపక్షం సమావేశం డిమాండ్‌ చేసింది. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సాయంత్రం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజధాని విషయంలో జగన్‌రెడ్డి మాట తప్పారు. దీనిపై ఆయన తిరిగి ప్రజాభిప్రాయం కోరాలి. మూడు ముక్కల రాజధానిపై ఆయనకు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల ముందుకు రావాలి. అసెంబ్లీలో దీనిపై మేం సవాల్‌ విసరబోతున్నాం’’ అని ప్రకటించారు. కాగా.. బాదుడే బాదుడుపై అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా నిలదీయాలని టీడీఎల్పీ నిర్ణయించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు విజయవాడలో నిర్వహించిన సమావేశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కృష్ణా జిల్లా నేతల్లో పోరాట స్ఫూర్తి కనిపిస్తోందని, దానిని ఆచరణలో కూడా చూపాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


కౌరవులందరినీ ఓడించి గౌరవ సభకు వస్తా: చంద్రబాబు

‘కౌరవ సభలోని కౌరవులందరనీ రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఓడించి అప్పుడు గౌరవ సభకు వస్తా’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.తాను ఏ బాధాకర పరిణామాల్లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించానో రాష్ట్ర ప్రజలకు తెలుసునని, ప్రతి సందర్భంలో ఆ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.

Updated Date - 2022-09-15T09:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising