ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ విగ్రహం అదృశ్యం.. ప్రజా సంఘాల ఆందోళన

ABN, First Publish Date - 2022-12-07T23:17:06+05:30

పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని మాయం చేయడంపై అన్నమయ్య జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం గాలివీడు రోడ్డు నుంచి రాయచోటి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, డిసెంబరు7: పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని మాయం చేయడంపై అన్నమయ్య జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం గాలివీడు రోడ్డు నుంచి రాయచోటి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ధర్నా చేశారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహానికే రక్షణ లేదంటే, ఇక సామాన్య దళిత, గిరిజ, బడుగు, బలహీన వర్గాల పరిస్థితి ఏమిటో అర్థం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సి వస్తుందని పాలకవర్గాలను హెచ్చరించారు. జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ అంబేద్కర్‌ విగ్రహాన్ని అపహరించిన వారిని తక్షణం గుర్తించి వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు రెడ్డెయ్య, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు రామాంజనేయులు, ప్రజాస్వామ్య కుల పరిరోణ సంస్థ రాష్ట్ర కార్యకర్త ఈశ్వర్‌, బాణాస నాయకుడు తాతయ్య, రజక సంఘం నాయకులు శ్రీనివాసులు, దళిత వేదిక నాయకుడు సుధీర్‌, సీపీఐ ఏరియా అధ్యక్షులు శ్రీనివాసులు, విశ్వనాఽథ్‌, జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, ఎల్‌హెచ్‌పీఎస్‌ శంకర్‌నాయక్‌, యుగంధర్‌, నాగార్జున, ఐఎఫ్‌ఎస్‌ శెట్టిపల్లె సాయికుమార్‌, జనసేన నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising