ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

floods: పోటెత్తుతున్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు

ABN, First Publish Date - 2022-08-11T16:59:21+05:30

గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. దాంతో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (BR Ambedkar Konaseema District)లోని లంక గ్రామాలకు వరద నీరు ప్రవేశిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ: గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. దాంతో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (BR Ambedkar Konaseema District)లోని లంక గ్రామాలకు వరద నీరు ప్రవేశిస్తోంది. పి.గన్నవరం నియోజకవర్గంలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు పోటెత్తుతున్నాయి. అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లో లంకప్రాంతాల్లో గోదావరి వరద ప్రభావం అధికంగా ఉంది. కనకాయిలంక కాజ్ వేపై వరద నీటి ఉధృతితో బోట్లపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి లంక కాజ్ వే పైకి వరద నీరు చేరింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిపోయాయి. అయినవిల్లి లంక‌ కాజ్ వే దగ్గర బోట్లు ఏర్పాటు చేయలేదని గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద తీవ్రత పెరుగుతుండడంతో కోటిపల్లి-ముక్తే శ్వరం రేవులో పంటు ప్రయాణాలు నిలిపివేశారు. దీంతో ఆయా లంక గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలోకి వరద నీరు చేరుతోంది. గురువారం ఉదయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. ధవళేశ్వరం (Dhavaleswaram) వద్ద నెల రోజుల వ్యవధిలో రెండోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న ప్రవాహంతో ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 

Updated Date - 2022-08-11T16:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising