ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నాం : డీజీపీ

ABN, First Publish Date - 2022-05-25T18:08:19+05:30

ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు. కోనసీమలో తాజా పరిస్థితిని ఎస్పీలు డీజీపీకి వివరించారు. అమలాపురం అల్లర్ల ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. కలెక్టరేట్‌, మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు నిప్పు, 3 బస్సుల దహనంపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే 46 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు డీజీపీ తెలిపారు. మరో 72 మంది అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నామని డీజీపీ వెల్లడించారు. అమలాపురంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. అల్లర్లను అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామన్నారు. వాట్సాప్‌ గ్రూప్‌లలో తప్పుడు ప్రచారంతోనే అల్లర్లు జరిగాయన్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-25T18:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising