ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagityalలో ఇంటర్ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడి

ABN, First Publish Date - 2022-05-23T17:55:45+05:30

ఇంటర్ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల పట్టణంలో గల మైనారిటీ గురుకుల కళాశాలలో డిప్యూటీ వార్డన్ రెచ్చిపోయాడు. చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో ఇంటర్ విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ నయీం కొట్టాడు. విద్యార్థిని కింద పడవేసి కాళ్లతో తన్ని ఆపై మొహంపై పిడిగుద్దులు గుద్దాడు.  విద్యార్థి ప్రాధేయపడినా కనికరించకుండా డిప్యూటీ వార్డెన్ తీవ్రంగా హింసించాడు. విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థి రాజును అకారణంగా కొట్టిన నయీంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. 

Updated Date - 2022-05-23T17:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising