ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్నారా: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

ABN, First Publish Date - 2022-01-31T23:57:03+05:30

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైన వృత్తి అని, ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ గురించి టీచర్స్ వాడిన భాష సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. టీచర్స్ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రవేటు స్కూల్స్‌లో చదివిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మీరు పాఠాలు చెప్పే స్కూల్స్‌లో మీ పిల్లలను ఎందుకు చదివించడం లేదని ఆయన ప్రశ్నించారు. టీచర్స్ తమ సమస్యలను సీఎంని కలిసి చెబితే సరిపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలు ఉంటే చర్చలు జరపాలని, అంతేకాని రోడ్డెక్కి నిరసనలు తెలపడం సరికాదని నారాయణస్వామి అన్నారు. 


Updated Date - 2022-01-31T23:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising