ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చాం: కేంద్రం

ABN, First Publish Date - 2022-04-04T22:06:46+05:30

రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం జవాబిచ్చింది. రెవెన్యూ లోటు కింద 2015-20 నుంచి 2020-21 ఆర్థిక ఏడాదిల్లో.. ఏపీకి రూ.28 వేల కోట్లు విడుదల చేసినట్టు కేంద్రం తెలిపింది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం, ఆర్థికసంఘాల సిఫార్సుల ప్రాతిపదికన.. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. 


మరోవైపు సీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉన్న కొన్ని అనుమతుల్లో సవరణలు కోరుతూ.. ఏపీ సీఎం నుంచి మూడు లేఖలు అందాయని కేంద్రం పేర్కొంది. 4 అంశాలపై మరిన్ని వివరాలు కోరుతూ 2 లేఖలను ఏపీకి పంపామని, అక్కడి నుంచి ఇంతవరకూ సరైన సమాధానం రాలేదని కేంద్రం తెలిపింది.

Updated Date - 2022-04-04T22:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising