ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమర్శలకు వివరణ ఇచ్చిన చినజీయర్ స్వామి

ABN, First Publish Date - 2022-03-18T23:09:16+05:30

తన వస్తున్న విమర్శలకు చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. మహిళలను తానెప్పుడూ కించపర్చేలా మాట్లాడలేదని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తనపై వస్తున్న విమర్శలకు చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. మహిళలను తానెప్పుడూ కించపర్చేలా మాట్లాడలేదని తెలిపారు. ఇటీవల చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వివాదాస్పమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు దేవతలను చిన్నచూపు చూసేటట్టు మాట్లాడానని అనడం పొరపాటని చెప్పారు. పూర్వాపరాలు తెలియకుండా ఒక ముక్క విని నిర్ణయానికి రావడం హాస్యాస్పదమన్నారు. కులాలను పక్కనపెట్టి.. జ్ఞానసంపన్నులను ఆరాధించాలన్నారు. గిరిజనులు మంత్రాలను అద్భుతంగా చదువుతారని తెలిపారు. ఆదివాసీలు, హరిజనులు అనే తేడాలేకుండా.. ప్రగతిపథంలో నడిపించాలని తమ గురువులు చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. 


‘‘ఈ మధ్య వచ్చిన ఆరోపణలు.. ఎలా వచ్చాయో వారి వివేకానికే వదిలేస్తున్నా. అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు. అది సబబా కాదా అనేది వినేవాళ్లకే వదిలేస్తున్నా. ఎవరి పద్ధతిలో వాళ్లు ఉండాలి. మన పద్థతిని మనం ఆరాధించుకోవాలి. కొందరిని చిన్నచూపు చూసే అలవాటు లేదు. పూర్వాపరాలు చూడకుండా మధ్యలో కొన్ని అంశాలపైనే మాట్లాడం సరికాదు. కొంతమంది దేవతలను చిన్నచూపు చూశామనడం నిజంకాదు’’ అని చినజీయర్‌ వివరణ ఇచ్చారు.


Updated Date - 2022-03-18T23:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising