జీపీఎస్ అమలు చేస్తే ప్రతిఘటన తప్పదు
ABN, First Publish Date - 2022-10-17T10:28:16+05:30
సీపీఎస్, జీపీఎస్ విధానాలు రెండూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టమని, జీపీఎస్ అమలు చేస్తే ప్రతిఘటన తప్పదని, పాత పెన్షన్ సాధనకు ఉ
అది ఏవిధంగా మెరుగో చెప్పాలి: యూటీఎఫ్
విజయవాడ (గవర్నర్‌పేట), అక్టోబరు 16: సీపీఎస్, జీపీఎస్ విధానాలు రెండూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టమని, జీపీఎస్ అమలు చేస్తే ప్రతిఘటన తప్పదని, పాత పెన్షన్ సాధనకు ఉద్యమిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర సదస్సులో వక్తలు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పాత పెన్షన్ విధాన సాధన కార్యాచరణలో భాగంగా ఆదివారం విజయవాడలో సీపీఎస్ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎ్‌సఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్‌రెడ్డి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని, డీఏలు సకాలంలో చెల్లిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఏ ఒక్కటీ అమలు పర్చలేదని అన్నారు. జీపీఎ్‌సను ఎలాంటి పరిస్థితిలోనూ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీపీఎస్ అమలుకు ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
Updated Date - 2022-10-17T10:28:16+05:30 IST