ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-02-14T21:23:07+05:30

ఏపీ ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని సీపీఐ రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుకాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని సీపీఐ రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుకాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు. ఏపీకి కేంద్రం అడుగడుగునా ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి నిధులివ్వడం లేదని ఆరోపించారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయకపోగా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకి రాయితీలను 2027 వరకు పొడిగించారని ఆయన పేర్కొన్నారు. ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందన్నారు. దీనిపై పోరాటానికి రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఈ నెల 20న విజయవాడలో ఏపీ ప్రత్యేకహోదా విభజన హామీల సాధన సమితి తరపున రౌండ్‌ టేబుల్‌ సమావేం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

Updated Date - 2022-02-14T21:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising