ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఆ వర్గానికే కేటాయించాలి: Ramakrishna

ABN, First Publish Date - 2022-02-12T17:59:57+05:30

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఆ వర్గానికే కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఆ వర్గానికే కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో జై భీం యాక్సెస్ జస్టిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ 2011 జనాభా ప్రకారం రాష్ట్రం లో 24 శాతం ఎస్సీ, ఎస్టీ జనాభా ఉండవచ్చన్నారు. 24 శాతం నిధులు బడ్జెట్‌లో వాళ్లకు కేటాయించాలని, ఆ నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ బడ్జెట్‌లో దళిత, గిరిజన, పేద వర్గాలకు పూర్తిగా అన్యాయం జరిగిందని తెలిపారు. కార్పొరేట్ వర్గాలకు మాత్రమే కేంద్ర బడ్జెట్‌లో న్యాయం జరిగిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కోత వేశారంటే దళితులకు కోత వేశారన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్లా వీరికి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పారు. ఇలాంటి సమావేశాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. రిటైర్మెంట్ ఏజ్ పెంచినందున జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం కొత్త ఉద్యోగాలు రావని రామకృష్ణ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-02-12T17:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising