ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అనంతలో రైతుల వెతలు తీర్చండి’..Jaganకు రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2022-06-13T14:14:18+05:30

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతుల వెతలు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతుల వెతలు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌(Jagan)కు రామకృష్ణ లేఖ రాశారు. గత యేడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా అనంతపురం జిల్లాలో దాదాపు రూ.10 వేల కోట్ల మేర పంట నష్టం జరిగిందన్నారు. గత 36 నెలలుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు అటకెక్కాయా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.467 కోట్ల పంట నష్టం నిధులు రైతుల కన్నీళ్లు ఎలా తుడవగలవు అని నిలదీశారు. రూ.1300 కోట్ల బకాయిలు చెల్లించకుండా కంపెనీలు బిందు, తుంపర సేద్యానికి పరికరాలు ఎలా సమకూరుస్తాయన్నారు. హంద్రీ-నీవాకు పంట కాల్వలు పూర్తిచేసి ఆయకట్టుకు నీళ్లు ఎప్పుడు ఇస్తారని అడిగారు. జీవో నెంబర్ 22 తీసుకొచ్చి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్కు మంగళం పాడటం తగునా అని ప్రశ్నించారు. ‘‘మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టండి’’ అంటూ రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-13T14:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising