ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటా పోటీగా ధరలు పెంచుతున్నాయి: Ramakrishna

ABN, First Publish Date - 2022-04-28T17:53:18+05:30

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు అధికంగా పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు అధికంగా పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని స్థానంలో ఉండి ధరలపై అబద్ధాలు ఆడుతున్నారన్నారు. 2014లో సెంట్రల్ టాక్స్‌కు ఇప్పుడు టాక్స్ తేడా ఎంత అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా ఆర్టీసీపై 720 కోట్ల డిజిల్ చెస్ వేశారన్నారు. కరెంట్ చార్జీలు పెంచి ఒక పక్క వాతలు, మరో పక్క కరెంట్ కట్ చేసి కోతలు అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటా పోటీగా ధరలు పెంచుతున్నాయని మండిపడ్డారు. ధరలు, చార్జీలు, పన్నులకు నిరసనగా ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. రాష్ట్ర సచివాలయం దగ్గర మే 9న ధర్నా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం ఏలుతుందని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు పెట్టిన సీపీఐ పార్టీ ధర్నాలు చేపడతామని రామకృష్ణ స్పష్టం చేశారు. 


Updated Date - 2022-04-28T17:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising