ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: ఏపీకి కేంద్రం పదేపదే ద్రోహం చేస్తున్నా జగన్‌కు పట్టదా?

ABN, First Publish Date - 2022-09-28T15:47:59+05:30

పీకి కేంద్రం పదేపదే ద్రోహం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి పట్టదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ (Andhrapradesh)కి కేంద్రం పదేపదే ద్రోహం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy)కి పట్టదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna)  ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును కూడా కేంద్రం(Central government) తుంగలో తొక్కిందన్నారు. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా లేదు,  విభజన హామీల అమలు లేదు. విశాఖ రైల్వే జోన్ లేదు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం లేదు. రెవిన్యూ లోటు భర్తీ లేదు’’ అంటూ విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ (Visakha steel factory)ని కేంద్రం తెగనమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి (AP CM) చోద్యం చూస్తున్నారన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు 31 మంది వైసీపీ ఎంపీలు (YCP MPs) ఉన్నా చేతులు ముడుచుకున్నారే? అంటూ నిలదీశారు. ఏపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచితే ఏపీకి ఎందుకు న్యాయం జరగదన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తును నరేంద్ర మోదీ (Narendra modi)కి  జగన్మోహన్ రెడ్డి  తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాటతప్పి మడమ తిప్పటమే జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని రామకృష్ణ (CPI Leader) వ్యాఖ్యలు చేశారు.  

Updated Date - 2022-09-28T15:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising