ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPI Ramakrishna: ఉద్యోగులను పోలీసులు వేధిస్తూనే ఉంటారా?

ABN, First Publish Date - 2022-08-31T16:45:46+05:30

సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన వాయిదా వేసుకున్నప్పటికీ పోలీసులు వేధిస్తూనే ఉంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీపీఎస్ (CPS) రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన వాయిదా వేసుకున్నప్పటికీ పోలీసులు వేధిస్తూనే ఉంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులపై పోలీసుల వేధింపులు ఆపాలన్నారు. పోలీసులు తాము కూడా ఉద్యోగులనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. శాంతియుత ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపాలనుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ముళ్లకంచెలు, పోలీసు ఆంక్షలు ఎందుకు? అదేమన్నా నిషేధిత ప్రాంతమా? అని నిలదీశారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు చేపట్టే ఆందోళనకు సీపీఐ (CPI) మద్దతు ఉంటుందని రామకృష్ణ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-31T16:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising